jaya janaki nayaka

18 Aug,2017

బోయపాటి మార్క్‌ ఆఫ్‌ లాజిక్‌లెస్‌ మ్యాజిక్‌

‘జయ జానకి నాయక’ మటన్‌ కొట్టుకు వెళ్ళి మల్లెపూు అడక్కూడదు.. బోయపాటి శీను సినిమాకి వెళ్ళి లాజిక్కు వెతక కూడదు. అసు సినిమా అంటేనే ఒక లాజిక్‌లెస్‌ మ్యాజిక్‌.  కాబట్టి సినిమాను కమర్షియల్‌ జిమ్మిక్కు కోసం చూడాలి తప్ప లా పాయింట్లు, లాజిక్కు కోసం కాదు అని నమ్మే పక్కా మాస్‌ మసాలా వినోద ప్రియును మరోమారు విజయవంతంగా బుట్టలో వేసుకున్నాడు బోయపాటి శీను. ఒక పక్కా కమర్షియల్‌ డైరెక్టర్‌గా ‘జయ జానకి నాయక’ సినిమాలో బోయపాటి చూపించిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్స్‌ చూసి ప్రేక్షకు లాజిక్కు మర్చిపోయి స్పెల్‌బౌండ్‌ అయ్యారంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అలాగని గతంలో ఎప్పుడూ రాని గొప్ప కథనో.. కొత్త కథనో తీసుకున్నాడా అంటే అదీలేదు. ఇలాంటి సంధర్భాల్లో ‘ఓల్డ్‌ వైన్‌ ఇన్‌ ది న్యూ బాటిల్‌’ అనేస్తారు క్రిటిక్స్‌. కానీ దీన్ని ‘న్యూ వైన్‌ ఇన్‌ ది ఓల్డ్‌ బాటిల్‌’ అనవచ్చు. 

ఇక కథగా చెప్పాంటే షరా మామూలే.. కాలేజిలో ర్యాగింగ్‌ చేస్తున్న ఒక బ్యాడ్‌ బోయ్‌ని మక్కెలిరగతంతాడు గుడ్‌బోయ్‌ అయిన హీరో గగన్‌ (బ్లెంకొండ శ్రీను). ఇంకేముంది ఇతని హీరోయిజాన్ని కళ్ళారా చూసి అతని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ని చెవులారా విని అతన్ని ప్రేమించేస్తుంది హీరోయిన్‌. నోట మాట రాని ఆ సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ హీరోని ప్రెస్‌ చేస్తుంది... అతని నాన్న, అన్నయ్యను ఇంప్రెస్‌ చేస్తుంది. అంత వరకూ ఓకే.  మరింకేంటి ప్రాబ్లమ్‌ అంటారా? ప్రాబ్లమ్‌ను  ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా క్రియేట్‌ చెయ్యాలో బాగా తెల్సినోడు బోయపాటి.  అందుకే హ్యాపీగా సాగిపోతున్న వ్‌ ట్రాక్‌ మీద ముప్పేట దాడి జరిపించేసాడు. ఒక వైపు పరువు కోసం ప్రాణాు తీసే జగపతిబాబు.. మరోవైపు హైవే కాంట్రాక్ట్‌ కోసం అడ్డం వచ్చిన వాడినల్లా నరికేసే విన్‌, ఇంకో వైపు ప్రతీకారం కోసం ఎదురుచూసే చాపకింద నీరులాంటి పొలిటీషియన్‌ సుమన్‌. ఇలా ముగ్గురు మోస్ట్‌ మెర్సిలెస్‌ విన్ల ట్రాయాంగిల్‌ వినీని సింగిల్‌ హ్యాండెడ్‌గా ఫేస్‌ చెయ్యాంటే ఆ హీరోకు ఎంత స్టామినా కావాలి..  ఆ క్యారెక్టర్‌ చేసే హీరోకు ఇమేజ్‌ పరంగా ఎంత ట్రాక్‌ రికార్డు ఉండాలి..? కానీ ఇక్కడ బ్లెంకొండ శ్రీను అనే జస్ట్‌ టూ ఫిలిమ్స్‌ ఓల్డ్‌బోయ్‌ మీద ఇంత భారమా..? ఇలాంటి సంధర్భాల్లోనే దర్శకుడి సత్తా బయటపడేది. హీరోను కమర్షియల్‌గా ప్రజెంట్‌ చేయడంలో తానొక బ్రాండ్‌గా ఎదిగాడు అని నమ్మినందుకు నిర్మాతకు, ట్రేడ్‌కు, ఆ యంగ్‌ హీరోకు బోయపాటి ఇచ్చిన బ్రేకింగ్‌ హిట్‌ ‘జయ జానకి నాయకా’

మ్లి ఎక్కుపెట్టిన అర్జునుడికి చెట్టు, పిట్ట తప్ప మరేమీ కనిపించలేదు.. కన్నుతప్ప.. ఇక్కడ ‘స్పీడున్నోడు’తో స్పీడు తగ్గిన బ్లెంకొండ శ్రీనును స్కైటచింగ్‌ రేంజ్‌లో  రీ ప్రజెంట్‌ చెయ్యడం అనే క్ష్యం తప్ప  మరే లాజిక్కు కనపడలేదు బోయపాటికి. ఆ క్ష్యాన్ని అతను ఛేదించిన విధానం సింప్లీ సూపర్బ్‌. హంసదీవి సీన్‌ హైలైట్‌గా ఆకర్షించే ఈ సినిమాలో ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకువెళ్ళిన  సన్నివేశాు, సంధర్భాు ఒక పది పన్నెండు ఉంటాయి. 

ఇక హీరో శ్రీను ప్రజెంటేషనూ.. హీరోయిన్‌ రకుల్‌ అందాు, అభినయం, ఒకరిని మించి ఒకరుగా చేసిన కాస్టింగ్‌ వెయిట్‌, డి.యస్‌.పి. మ్యూజిక్‌, రిషి పంజాబి ఛాయాగ్రహణం, రామ్‌క్షణ్‌ మైండ్‌ బ్లోయింగ్‌ ఫైట్‌ కంపోజిషన్స్‌, నిర్మాత రవీంద్ర రెడ్డి దమ్ము`సొమ్ము, ఇలా ఈ అందరి కాంబోలో వచ్చిన హై ఓల్టేజ్‌ కమర్షియల్‌ బొనాంజా ‘జయ జానకి నాయకా’.

నేను తీసింది దేశభక్తి, దైవభక్తి చిత్రం కాదు. నమ్మి వచ్చిన నిర్మాత సంక్షేమ చిత్రం అని బోయపాటి త్రికరణశుద్ధిగా ఆచరించి విజయం సాధించాడు కాబట్టి ఇందులోని లోపాను, లోటుపాట్లను కమర్షియల్‌ ఎక్స్‌క్యూజెస్‌గా వదిలేయవచ్చు. సో మై రేటింగ్‌ టు ‘జయ జానకి నాయకా’ ఈజ్‌ : 3.25 / 5

Recent reviews