ఇంటిలిజెంట్-పక్కా కమర్షియల్ సినిమా - లావణ్య

06 Feb,2018

ఇంటిలిజెంట్ - పక్కా కమర్షియల్ సినిమా - లావణ్య

సుప్రీం హీరో సాయిధరం తేజ్ హీరోగా సెన్సషనల్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం లో సి.కె. ఎంటర్ టైన్ మెంట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇంటిలిజెంట్. అందాల తార లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భముగా సంస్థ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం లో ఇంటిలిజెంట్ సినిమా విశేషాలు లావణ్య త్రిపాఠి మాటల్లో.

క్యూట్ అమ్మాయిని ప్రేమలో పడ్డాను.

ఇంటిలిజెంట్ సినిమాలో నా పేరు సంధ్య. యూ.ఎస్. లో చదువు తర్వాత ఇండియా కి వచ్చి మా డాడీ బిజినెస్ లు చూస్తుంటాను. కోపం చాలా ఎక్కువ. ఎప్పుడూ అందరినీ డామినేట్ చేస్తూ ఉంటాను. అలాంటి అమ్మాయి ప్రేమలో ఎలా పడింది అనేది సస్పెన్స్. క్యూట్ లవ్ స్టోరీ. యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.

తేజు తో లవ్ సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.

తేజ్ చాలా మంచి యాక్టర్ తో పాటు మంచి డాన్సర్ కూడా. సెట్లో ఎప్పుడూ జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి. మస్కట్ లో షూటింగ్ అప్పుడు ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. లవ్ సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి.

తేజు క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్:

కథ చాలా ఇంటిలిజెంట్ గా ఉంటుంది.వెరీ టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ.ఒక సామాన్య వ్యక్తి తన తెలివితేటల తో సమాజానికి,,పేద ప్రజలకి ఎలాంటి మేలు చేసాడు అనేది మెయిన్ కాన్సెప్ట్.ఇవే కాకుండా ఇంకా మూవీలో చాలా అంశాలు ఉంటాయి.ధర్మ క్యారెక్టర్ లో తేజ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు.

ఫస్ట్ టైం డాన్సులు ప్రాక్టీసు చేసాను.

ఫస్ట్ టైం ఈ చిత్రం లో డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేసి చేశాను.నా ఫెవరెట్ లెజండరీ యాక్టర్ చిరంజీవి గారి "చమక్ చమక్" సాంగ్ ని తెలుగు,హిందీ లో చూసాను.ఆపాటని రీమిక్స్ చేయడం చాలా కష్టం.అయినా ఈ మూవీ లో చేసాం. వెరీ బ్యూటిఫుల్ సాంగ్.సెల్ ఫోన్,కళ కళ కళామందిర్,పాటలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.తేజ్ తో డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేసాను.

వినాయక్ గారు చాలా కేర్ తీసుకున్నారు.

వెరీ హంబుల్ అండ్ వెరీ స్వీట్ డైరెక్టర్. పెద్ద డైరెక్టర్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ గా వుంటారు. చాలా కంఫర్టుబుల్ గా సెట్లో వుంటారు. నా పట్ల చాలా కేర్ఆ తీసుకున్నారు. ఆర్టిస్ట్ దగ్గర ఏ రియాక్షన్ కావాలో బాగా తెలిసిన వ్యక్తీ. ఎంత పెద్ద సీన్ అయినా చాలా ఫాస్ట్ గా తీస్తారు.నటిగా అయన దెగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.

హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు.

హిట్ ప్లాప్ అనేది కామన్.సక్సెస్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో చూసుకొంటాం.ఫీడ్ బ్యాక్ అనేది కచ్చితంగా తీసుకుంటాను.భలే భలే మగాడివోయ్,,సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు కమర్షియల్ గా నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అలాగే ఇంటిలిజెంట్ కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

కళ్యాణ్ గారికి సినిమా అంటే ప్యాషన్

సి కళ్యాణ్ గారు వెరీ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. ప్రతిరోజూ సెట్ కి వచ్చి అందరికి ఎం కావాలో అన్నీ దెగ్గరుండి చూసుకునేవారు.క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్ గా నిర్మించారు.పాటలకి మాత్రమే కాకుండా ఫైట్స్ కి కూడా భారీగా సెట్స్ వేసి తీశారు.అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సి.వి. రావు,పత్సా నాగరాజ్ ఇద్దరూ చాలా కోపరేట్ చేసి సినిమాని వండర్ ఫుల్ గా చేశారు.సి కె లో మల్లి మల్లి వర్క్ చేయాలని వుంది.

సినిమాకి చాలా హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.దాదాపు యాభై వేలమందికి పై గా హాజరయ్యారు.చాలా సంతోషం గా అన్పించింది. సాంగ్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి.థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.

మిగతా సినిమాలు

గీత ఆర్ట్స్ విజయ్ దేవర కొండ మూవీ చేస్తున్నాను.పరశురామ్ డైరెక్టర్.తమిళ్,మలయాళం నుండి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి.ఇన్కా ఏది కమిట్ కాలేదు.నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకే ఇస్తాను.హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY