Ram Charan interview

09 Jan,2019

నాన్నకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చింది నేనే   - రామ్ చరణ్ 

గత ఏడాది రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఓ వైపు నిర్మాతగా .. మరో వైపు స్టార్ గా రెండు పడవలపై సమాంతర ప్రయాణం చేస్తూ తనదైన సత్తా చాటుకుంటున్నాడు. తాజాగా అయన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ తో ఈ సంక్రాంతి బరిలో దిగాడు .. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఈ నెల  11న విడుదలవుతున్న సందర్భంగా రామ్ చరణ్ తో ఇంటర్వ్యూ ..  

రంగస్థలం తరువాత ... 

ఒక నటుడిగా ఒక దానికే పరిమితం కాకూండా అన్ని జోనర్లులలో సినిమా చేయాలనేదే నా ఉద్దేశం. 80వ దశకంలో నాన్న గారు కూడా అన్ని జోనర్లలో సినిమా లు చేశారు.  జోనర్ కంటే కూడా ఒక సెన్సబుల్ సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమాను అంగీకరించాను. ఇది ఒక నలుగురు అన్నదమ్ముల కథ .. వారి కుటుంబంలో జరిగిన సంఘటనలతో ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో నేను రామ్ పాత్రలో నటించాను. ప్రతి ఇంట్లో ఇలాంటి వాడు, ఓ కొడుకు, తమ్ముడు, మరిది ఇలాంటి ఒకడు ఉండాలి అనుకునే పాత్ర.  అయోధ్య రాముడన్నమాట, వినయంగా వుంటూ అవసరమైతే విధ్వసం కూడా సృష్టించే టైప్ లో ఉంటుంది నా పాత్ర.


బోయపాటి  యాక్షన్ ... 

ఈ సినిమా విషయంలో సరైన సమయం దక్కలేదు .. ఇంకా సమయం ఉంటే బాగుండేది అనిపించింది. రంగస్థలం షూటింగ్ అయిపోయాక 25వ రోజుల గ్యాప్ లో ఈ చిత్ర షూటింగ్ ను మొదలు పెట్టాం. బోయపాటికి వున్న కమిట్మెంట్స్ అలాగే నా కమిట్మెంట్స్ వల్ల సినిమా షూటింగ్ ను తొందరగా మొదలు పెట్టాం. అయితే డైరెక్టర్ కు ఉన్న క్లారిటీ వల్ల నాకు ఈ పాత్ర చేయడం పెద్ద కష్టమేమి అనిపించలేదు. ఇంకా టైం ఉంటె .. బాగుండేది.  దీన్ని రంగస్థలం సినిమాతో పోల్చడం సరికాదు. ఏ సినిమా అయినా మంచి సినిమా కావాలని ట్రై చేస్తాం .. అయితే అభిమానులు మాత్రం రంగస్థలం మారరుగా అది వారిష్టం.  గ్యాంగ్ లీడర్ లా ఉంటుందని అంటున్నారు 
ఆ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి పోలిక ఉండదు .. నేను గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేయాలనీ ఇంతకుముందు అన్నాను కదా .. అందుకే ఈ సినిమాను అలా పోలుస్తున్నారేమో. 

 రాజమౌళి సినిమాలో... 

రాజమౌళి మళ్లీ డి గ్లామరైజ్డ్ పాత్రను సృష్టించారు. సాధారణ యువకుడిగానే కనిపిస్తా,  ఈపాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈసినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం ఈ సినీమాకే కేటాయించాను. ఎన్టీఆర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇప్పటునుండో మేమిద్దరి ఫ్రెండ్స్ .. మా ఇద్దరి కాంబినేషన్ సీన్లు చాలా బాగా వస్తున్నాయి. ఎన్టీఆర్ తో కలసి పనిచేస్తుండడం మంచి అనుభూతి.

సైరా ... 

మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత మంచి డేట్ చూసి సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఇంత బిజీగా ఉన్న మీరు ఓ వైపు హీరోగా .. మరో వైపు నిర్మాతగా చేయడం రిస్క్  ఒక్కోసారి అనిపిస్తుంది..  కానీ  నచ్చిన పని కాబట్టి అనుకున్న విధంగా చేస్తుంటాను. లేదండి. అది కేవలం నాన్న గారి సినిమాల కోసం మాత్రమే పెట్టాను. అందులో నేను హీరోగా కూడా సినిమాలు చేయను. నాకు చాలా మంచి నిర్మాతలు వున్నారు. ప్రస్తుతానికైతే వేరే హీరోలతో సినిమా  చేసే ఆలోచన లేదు.  ప్రత్యేకంగా ఏ  బ్యానర్ ఎందుకంటే కొన్ని నచ్చిన కథలు చేయాలంటే బయటి బ్యానర్ వాళ్ళు బడ్జెట్ విషయంలో రిస్క్ చేయక పోవచ్చు .. అందుకే మనకు నచ్చిన సినిమాలు చేయడానికి ఈ బ్యానర్.  చిరంజీవికి రెమ్యూనరేషన్ కరెక్ట్ గా తెలుగులో ఏ నిర్మాత ఇవ్వని రెమ్యూనరేషన్ నేను ఇస్తున్నాను .. కావాలంటే నాన్నకు అడగండి. 

భారీ బడ్జెట్ తో ...  

మనం పెట్టిన డబ్బు వెనక్కి వచ్చినంత వరకు అది రిస్క్ కాదు.  నెక్స్ట్ సినిమా అంటే ప్రస్తుతం రాజమౌళి సినిమా ఉంది. ఆ తరువాత కొరటాల శివ తో సినిమా ఉంటుంది .. నాన్న - కొరటాల శివ సినిమా అయ్యాక శివతో నేను సినిమా చేస్తా. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY