బన్నీలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా

28 Feb,2019

బన్నీలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా - నూరిన్ షరీప్ 

మలయాళంలో క్రేజ్ తెచ్చుకున్న ఓరు ఆధార్ లవ్ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతొ అందించారు. ఈ సినిమాలో  నూరిన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఉంగ‌రాల జుట్టుతో స‌ర‌దా స‌ర‌దాగా ఉంటూ, ఆఖ‌రున ఉన్న‌ట్టుండి అంద‌రినీ భావోద్వేగానికి గురి చేసిన అమ్మాయి. సుఖీభ‌వా సినిమాస్ ప‌తాకంపై గురురాజ్ తెలుగులో నిర్మించారు. సి.హెచ్‌.వినోద్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఒమ‌ర్ లులు నిర్మాత‌. ఈ సినిమా గురించి నూరిన్ హైద‌రాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు .. ఆ విశేషాలు... 
 నేను చేసిన గాథ పాత్ర‌ని ప్రేక్ష‌కులు ఇంత‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ని అనుకోలేదు. చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. త‌మ స్కూల్ ఫ్రెండ్స్ లో ఒక‌రిని క‌లిసిన భావ‌నే క‌లుగుతోంద‌ని చాలా మంది చెప్పారు. ఇందులో మొద‌టి నుంచీ నాకు ఇంపార్టెంట్ రోల్ అనే చెప్పారు. మీర‌న్న‌ట్టు క‌థ‌ని కూడా కాస్త చేంజ్ చేశారు.  ముందు అనుకున్న‌  పాత్ర‌ అయినా ఇపుడు ఈ పాత్రకు   చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. చూసిన‌వారంద‌రూ బావుంద‌ని మెచ్చుకున్నారు. - క‌న్ను కొట్ట‌డం, గ‌న్ను పేల్చ‌డం, మాణిక్య మ‌ల‌రాయ్ పాట విడుద‌ల కావ‌డం.. వాటన్నిటికీ చాలా మంచి స్పంద‌న రావ‌డం వ‌ల్ల క‌థ‌లో మార్పులు చేశారు. ఆ సమయంలో  నేను అప్‌సెట్ అయ్యాన‌న్న‌ది ప‌ట్టించుకోవాల్సిన విష‌యం కాదు. అయినా మ‌నంద‌రం మ‌నుషులం. కోప‌తాపాలు క‌చ్చితంగా ఉంటాయి. - ప్రియ‌ను నేను తొలిసారి సెట్స్ మీదే క‌లిశాను. మా మ‌ధ్య కొన్ని సీన్లు కూడా ఉన్నాయి. మా మ‌ధ్య గొడ‌వ‌లు ఏమీ లేవు. మ‌ల‌యాళంలో మొద‌ట మిక్స్డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. పెద్ద‌వారికి, యువ‌త‌కు న‌చ్చింది. అయితే క్లైమాక్స్ మార్చాక ఇంకా చాలా మందికి న‌చ్చింది. నాకు మొద‌టిదీ బావుంది. ఈ వెర్ష‌న్ కూడా బావుంది. థియేట‌ర్ లో సినిమా చూస్తున్నంత సేపు మేం ప‌డ్డ క‌ష్టం, షూటింగ్ చేసిన రోజులు గుర్తుకురాసాగాయి. ఇక ఆడియో వేడుక‌కు బ‌న్నీ రావ‌డం చాలా హ్యాపీ నేను చిన్నప్పటినుండి `బ‌న్నీ`, `హ్యాపీ` వంటి సినిమాల‌ను టీవీలో చూస్తూ పెరిగాను. అల్లు అర్జున్‌లాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌నుకున్నాను. అలాంటిది నేను న‌టించిన సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఆడియో వేడుక‌కు ఆయ‌న రావ‌డం, వేడుక ఆఖ‌రున ఆయ‌న నా చేతిని ప‌ట్టుకోవ‌డం జీవితంలో మ‌ర్చిపోలేను. ఆ క్ష‌ణంలో ఎవ‌రో ఫొటోలు కూడా తీశారు.   నిజ జీవితంలో సరదాగా ఉండను, నేను ఎవ‌రితోనూ అంత తేలిగ్గా క‌ల‌వ‌ను. ఒక వేళ క‌లిస్తే `ద‌య‌చేసి కాసేపు ఊరుకుంటావా` అని అవ‌త‌లివాళ్లు అడిగేలాగా ప్ర‌వ‌ర్తిస్తా. ద‌గ్గ‌రివారి ద‌గ్‌సర మాత్ర‌మే స‌ర‌దాగా మాట్లాడ‌గ‌ల‌ను. * నెక్స్ట్  సినిమాలి ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ఇదే ద‌ర్శ‌కుడితో ఓ సినిమా ఉంది. తెలుగులో కొన్ని క‌థ‌లు వింటున్నా. 
 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY