కంటిపాప కంటిపాప చెప్ప‌లేదే.. అంటోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

18 Mar,2021

‌వ‌కీల్‌సాబ్ సినిమానుంచి మూడో సాంగ్‌గా `కంటిపాప కంటిపాప చెప్ప‌లేదే.. కాలిమువ్వ కాలిమువ్వ స‌వ్వ‌డైనా లేదే..` అనే పాట మంగ‌ళ‌వారంనాడు విడుద‌లైంది. రామ‌జోగ‌య్య‌శాస్రి రాసిన ఈ పాట‌కు త‌మ‌న్ సంగీత బాణీలు స‌మ‌కూర్చారు. హిందీ పింక్ సినిమాకు రీమేక్ ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాట వీడియోలో కాల్ళ‌కు గ‌జ్జ‌లు క‌ట్టుకుని హీరోయిన్ డాన్స్ వేస్తుండ‌గా వాటిని ఆల‌పిస్తూ సాగే పాట‌. వినోద్ సినిమాటో్ గ్ర‌ఫీ అందించారు. శ్రుతిహాస‌న్‌పై కూచిపూడి నాట్యం చేస్తుండ‌గా చిత్రీక‌రించిన ఈ పాట‌ను అమ‌న్ మాలిక్‌, దీపూ, గీతామాధురి త‌దిత‌రులు ఆల‌పించారు. ఇది ఇప్ప‌టికే ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇదిలా వుండ‌గా, ఈసినిమా ఈవెంట్‌ను యూసుఫ్‌గూడాలో చేయ‌నున్నారు.

https://www.youtube.com/watch?v=OpgZzj_Xjzw

@MusicThaman Musical🎹
📝@ramjowrites 
🎤@ArmaanMalik22

#VakeelSaabOnApril9th
#SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla

Recent News