మజిలీ రివ్యూ

06 Apr,2019

 

దర్శకత్వం : శివ నిర్వాణ 
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది 

కెమెరా : విష్ణు శర్మ 

సంగీతం : గోపిసుందర్ 
రీ రికార్డింగ్ : ఎస్ ఎస్ థమన్ 
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి 
నటీనటులు : నాగ చైతన్య, సమంత, దివ్యంకా కౌశిక్, రావు రమేష్, పోసాని, సుబ్బరాజు తదితరులు 
విడుదల : 5 - 04 - 2019
రేటింగ్ : 3 / 5

 నాగ చైతన్య, సమంత లు కలిసి పెళ్ళికి ముందు మూడు సినిమాలు చేసారు. ఈ జోడి పెళ్లి తరువాత నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మొదటి నుండి  ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు పెళ్లి తరువాత కాబట్టి ఆ ఆసక్తి ఇంకా ఎక్కువైంది. పైగా పెళ్లి తరువాత సరైన కథను ఎంపిక చేసుకుని నటించిన చిత్రమే మజిలీ. నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమ మజిలీ ఎక్కడికి వెళ్ళింది ? అన్న వివరాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ :

జీవితంలో అన్ని రకాలుగా ( లవ్, కెరీర్ ) ఫెయిల్ అయిన యువకుడు పూర్ణ ( నాగ చైతన్య ) ఎలాంటి బాధ్యత లేకుండా తన గతాన్ని తలచుకుంటూ తాగుబోతుగా మారతాడు. అతన్ని పెళ్లి చేసుకున్న శ్రావణి ( సమంత ) అతను ఎలా ఉన్న పరవాలేదు నా పక్కన ఉంటె చాలు అనుకునే భార్య. పూర్ణ ఎలాంటి  గొడవలు రేపిన, ఏమి చేసినా  సరే భర్త కె సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరి పెళ్లయింది కానీ పూర్ణ జీవితంలోకి ఇంకా శ్రావణి ప్రవేశించలేదు. ఇద్దరి మధ్య చాలా  దూరం ఉంటుంది. ఆ తరువాత అనుకోని నాటకీయ పరిణామాల మధ్య మీరా అనే పాప వీరి జీవితంలోకి వస్తుంది. ఆ పాప వారి లైఫ్ లోకి రావడం వల్ల వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? అసలు ఇన్నాళ్లు జీవితాన్ని పోగొట్టుకున్న పూర్ణ గతం ఏమిటి ? అసలు ఈ పాప రాకతో అతను మారాడా ? ఇంతకీ ఈ పాప ఎవరు ? ఇన్నాళ్లు భార్యను దూరం పెట్టిన పూర్ణ తన భార్య మనసు గెలుచుకున్నాడా ? అన్నది మిగతా కథ.  
 

నటీనటుల ప్రతిభ :
 
హ్యూమన్ ఎమోషన్స్ కు సంబందించిన సినిమా కాబట్టి నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుండాలి .. లేదంటే అంతే సంగతులు .. ఈ విషయంలో ఇందులో నటించిన అందరు బాగా చేసారు. ముఖ్యంగా నాగ చైతన్య నటన సినిమాకే హైలెట్. అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పక తప్పదు. లవ్ ఫెయిల్ అయిన యువకుడిగా, జీవితంలో అన్ని కోల్పోయిన వ్యక్తిగా ,తాగుబోతుగా  చక్కగా నటించాడు. ముఖ్యంగా పూర్ణ పాత్రలో జీవించాడు. ఇక సమంత గురించి కొత్తగా చెప్పేది ఏమిలేదు. శ్రావణి పాత్రలో అదరగొట్టింది. భర్త అంటే అమితంగా ప్రేమించే భార్యగా మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, ఎమోషన్, పెయిన్ లాంటి అంశాలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. దాంతో పాటు మధ్యతరగతి జీవితాల నేపథ్యంలో సాగిన ఈ కథ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.  హీరో తండ్రి పాత్రలో రావు రమేష్ సూపర్బ్. ఇక  హీరోయిన్ తండ్రి గా తన కూతురు జీవితంకోసం ఆరాటపడే తండ్రి పాత్రలో పోసాని నటన చక్కగా ఉండి అక్కడక్కడా నవ్వులు కూడా పూయిస్తాయి. మరో హీరోయిన్ దివ్యంక కౌశిక్ తన నటనతో ఆకట్టుకుంది. ముక్యంగా చాలా అందంగా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేశారు. 

టెక్నీకల్ హైలెట్స్ :  

ఇలాంటి ఎమోషనల్ సినిమాలకు రీ రికార్డింగ్ ప్రాణం పోస్తుంది. ఆ విషయంలో థమన్ తన ఆర్ ఆర్ తో సినిమాను  ఓ మెట్టు పైనే నిలబెట్టాడు. ఇక గోపిసుందర్ ఇచ్చిన పాటలు సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకునేలా ఉన్నాయి. విష్ణు శర్మ ఫొటోగ్రఫీ బాగుంది. వైజాగ్ అందాలని చక్కగా చూపించాడు. కథకు అనుగుణంగా విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు . చక్కని ప్రతిభ కనబరిచాడు.  అయితే కథనం కాస్త నెమ్మదిగా సాగడం కాస్త మైనస్ గా అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకా  తన కత్తెరకు పని చెబితే బాగుండేది.  ప్రేమలో ఫెయిల్ అయి తన జీవితాన్ని పోగొట్టుకున్న ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ సినిమా హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యంలో చక్కగా సాగింది. భర్తను ప్రేమించే భార్య, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేని భర్త లాంటి అంశాలతో కథను అల్లుకున్న దర్శకుడు ఫీల్ గుడ్ కథను చెప్పాడు . కానీ మొదటి భాగంలో ఉన్న వేగం రెండో భాగం వచ్చేసరికి తగ్గింది. పైగా కథ విషయంలో కొత్త కథ కాకున్నప్పటికీ సరికొత్త  కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే వేగం తగ్గి అక్కడక్కడా బోర్ కొట్టేస్తుంది. ప్రేమించిన అమ్మాయి పేరు పెళ్లి కార్డులో ఉండదురా లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 

విశ్లేషణ : 
 
సమంత, నాగ చైతన్య కాంబినేషన్ లో పెళ్లి తరువాత వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వ ప్రతిభ, థమన్ రి రికార్డింగ్ , గోపిసుందర్ పాటలు, డైలాగ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జీవితంలో లవ్, కెరీర్ లో ఫెయిల్ అయిన ఓ యువకుడి జీవితంలోకి ప్రవేశించిన మరో అమ్మాయి .. తన భర్త లోని ఎమోషన్ ని అర్థం చేసుకున్న భార్య కథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. సమంత, చైతూల నటన హైలెట్ . అయితే కథనం చాలా నెమ్మదిగా సాగడం. సెకండాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు మైనస్ గా మారాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడి తెరకెక్కించిన విధానం సూపర్. మొత్తానికి చైతు కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పాలి. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY