ప్రేమకథా చిత్రం 2 

11 Apr,2019

దర్శకత్వం : హరికిషన్ 
నిర్మాత : సుదర్శన రెడ్డి 
సంగీతం : జేబీ 
కెమెరా ; రాంప్రసాద్ సి 
నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది , ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్ తదితరులు .. 
విడుదల : 6- 04-2019
రేటింగ్ : 2. 25 / 5  

ఆ మధ్య వచ్చిన ప్రేమకథా చిత్రం సినిమా హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి సంచనల విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులను హర్రర్ సినిమాలవైపు మళ్లించింది. ఆ సినిమా సక్సెస్ తో సౌత్ లో పలు హర్రర్ సినిమాలు వచ్చాయి .. వస్తూనే ఉన్నాయి. తాజాగా దానికి సీక్వెల్ గా ప్రేమకథా చిత్రం 2 ని తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ , నందిత శ్వేతా, సిద్ది నటించిన ఈ సినిమా ఈ ఉగాది సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో దెయ్యం ఉందా, ఉంటె ఎలా భయపెట్టింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .. 

కథ : 

స్టూడెంట్ అయిన సుధీర్ ( సుమంత్ అశ్విన్ ) చాలా మంచి యువకుడు. అతని బిహేవియర్ చూసి అదే కాలేజ్ లో చదువుతున్న బిందు ( సిద్దు ) ఇష్టపడుతుంది. సుధీర్ పై ప్రేమ పెంచుకున్న బిందు అతనితో తన ప్రేమను అతనికి ఓ సందర్బంగా చెబుతుంది .. . కానీ సుధీర్ అప్పటికే నందు ( నందిత శ్వేతా ) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని .. బిందు ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని పరిణామాల అనంతరం నందు .. సుధీర్ తో ఏకాంతగా గడిపేందుకు ఓ ఫామ్ హౌస్ కి తీసుకుపోతుంది. ఆ తరువాత జరిగే సంఘటనలతో నందుకు దెయ్యం పట్టిందని తెలుసుకుంటాడు సుధీర్. అసలు నందుకు పట్టిన దెయ్యం ఎవరు ? మధ్యలో చిత్ర అనే అమ్మయి ఎంట్రీ ఇస్తుంది ? ఇంతకీ చిత్ర ఎవరు ? ఆ దెయ్యం నుండి నందును సుధీర్ కాపాడాడా ? అన్నది మిగతా కథ .  
 
నటీనటుల ప్రతిభ : 
 
హర్రర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ పాత్రలో సుమంత్ అశ్విన్ చక్కగా నటించాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ లో సుమంత్ అశ్విన్ నటన బాగుంది. ఇక నందు పాత్రలో .. నందిత శ్వేతా అదరగొట్టింది. ముఖ్యంగా దెయ్యం పట్టిన అమ్మాయిగా ఆమె జీవించేసిందని చెప్పాలి. మొదటి నుండి భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నా నందితకు మరో నటనకు స్కోప్ ఉన్న చిత్రమిది.  ఇక సిద్ది గ్లామర్ పాత్రలో ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో బాగా చేసింది. ఇక మిగతా పాత్రల్లో మిగిలిన నటీనటులు వారివారి పాత్రల్లో బాగానే చేసారు. ప్రభాస్ శ్రీను అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. 

టెక్నీకల్ హైలెట్స్ :

హర్రర్ సినిమాలకు రీ రికార్డింగ్ కీలకం అని చెప్పాలి .. ఈ విషయంలో జెబి పనితనం పరవాలేదనిపిస్తుంది. ఇక పాటలు యావరేజ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది .. డార్క్ సైడ్ సన్నివేశాలు, సాంగ్స్ బాగా చిత్రీకరించారు . ఇక దర్శకుడు హరికిషన్ రాసుకున్న స్క్రిప్ట్ ఆకట్టుకునేలా లేదు. పాత రొటీన్ ఫార్ములా తీసుకుని దాన్ని అంతకంటే రొటీన్ గా తెరకేకించే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ విషయంలో కేర్ తీసుకున్న దర్శకుడూ సెకండ్ హాఫ్ పై  ఫోకస్ పెట్టలేదు . కథ నెమ్మదిగా సాగడం. రొటీన్ సన్నివేశాలు, బలమైన అంశాలు లేకపోవడంతో సినిమా చాలా నీరసంగా సాగుతుంది. కనీసం ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు పరవాలేదు.  డజన్లకొది హర్రర్ సినిమాలు సౌత్ లో రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఎలాంటి కొత్తదనం లేని కథను చెప్పాలనున్నాడు దర్శకుడు పైగా ఎక్కడ ఆసక్తి కలిగించే అంశాలు కనిపించవు. అనవసర సన్నివేశాలు నీరసం తెప్పిస్తాయి. 


విశ్లేషణ :

హర్రర్ సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా చాలా నీరసంగా ఉంటుంది. కథలో , కథనంలో ఎక్కడ కొత్తదనం లేకపోవడం. ప్రేక్షకులను ఆకట్టుకునే దృశ్యాలు లేకపోవడం లాంటి అంశాలు విసుగు పుట్టిస్తాయి. ప్రేమకథా చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించి హర్రర్ సినిమాలవైపు మళ్లేలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆ టైటిల్ తప్పా మిగతాదంతా జీరో. నటిగా నందిత శ్వేతా నటన బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో హర్రర్ పండించడంలో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. సుమంత్ అశ్విన్ నటన యావరేజ్, సిద్ది గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకొని హర్రర్ కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను బయపెట్టడంలో విఫలం అయింది. కథనం చాలా బోరింగ్ గా సాగుతూ .. సినిమా పై ఉన్న కాస్త ఆసక్తిని దెబ్బ తీసేలా మారింది పరిస్థితి.

ట్యాగ్ లైన్ : విసుగు తెప్పించిన దెయ్యం 

Recent reviews