13 Apr,2019

ర్శకత్వం : కిశోర్ తిరుమల 
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, మోహన్ సివి, వై వి రవిశంకర్ 
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ 
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్ 
ఫోటోగ్రఫి : కార్తీక్ ఘట్టమనేని 
నటీనటులు : సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురేజ్, సునీల్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పోసాని తదితరులు  
విడుదల : 12- 04 -2019
రేటింగ్ : 2. 75 / 5 

వరుస పరాజయాల తరువాత సాయిధరమ్ తేజ్ తన కెరీర్ కు సరైన సక్సెస్ కావాలన్న ఆలోచనతో కొంత గ్యాప్ తీసుకుని   కాస్త మేక్ ఓవర్ మర్చి చిత్రలహరితో మన ముందుకు వచ్చాడు. ప్రేమకథ చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ .. సారీ .. పేరు మార్చుకున్న సాయి తేజ్ కు చిత్రలహరి ఆ ప్లాప్ సినిమాల కు బ్రేక్ వేస్తుందా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ :

కెరీర్ పరంగా అన్ని విషయాల్లో ఎప్పుడు జీవితంలో  ఫెయిల్ అయ్యే విజయ్ భార్గవ్ ( సాయి తేజ్ ) పేరులో ఉన్న విజయం అతడి లైఫ్ లో ఉండదు. చదువులో ఇంటిలిజెంట్ అయిన విజయ్ కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ వాటిని ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా  అతగాడికి ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఈ నేపథ్యంలో లహరి ( కళ్యాణి ప్రియదర్శిని ) ని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత ఆమె చదువుతున్న కాలేజ్ ట్ తెలుసుకుని అందులో చేరతాడు.  అలా  వారిద్దరి మధ్య పరిచయం కాస్తా  ప్రేమగా మారుతుంది. వారి ప్రేమ సాఫీగా సాగిపోతున్న సమయంలో   లహరి తన ఫ్రెండ్ చిత్ర ( నివేద పేతురేజ్ ) ఎవరిని నమ్మని అమ్మాయి. ఈ ప్రపంచంలో అందరు మోసగాళ్ళే అని చెబుతూ .. లహరి ప్రేమ విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అలా చిత్ర మాటలు నమ్మిన లహరి - విజయ్ తో బ్రేకప్ చెబుతుంది. ఇప్పటికే జీవితంలో కెరీర్ పరంగా ఫెయిల్ అయిన విజయ్ ఇప్పుడు లవ్ లో కూడా ఫెయిల్ అవ్వడంతో అతను టెన్షన్ కు గురవుతాడు. ఆ తరువాత  అతని జీవితం ఏటు  వైపుకు వెళ్ళింది? ఫైనల్ గా లహరి విజయ్ ని అర్థం చేసుకుందా ? లేదా ?  అతని జీవితంలో లేని సక్సెస్ ని ఫైనల్ గా అందుకున్నాడా ? లేదా అన్నది మిగతా కథ !

నటీనటుల ప్రతిభ :  

విజయ్ భార్గవ్ పాత్రలో సాయి తేజ్  చక్కగా నటించాడు. అతని పాత్ర నేటితరం యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. జీవితంలో లూజర్ గా మారిన యువకుడిగా, జీవితంతో పోరాటం చేసే సత్తా ఉన్న వాడిగా చక్కగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్, నటన కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. లహరి పాత్రలో అమాయకపు అమ్మాయిగా కళ్యాణి ప్రియదర్శిని తన పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. ముఖ్యంగా  ఆమె అమాయకత్వం. క్యూట్ నెస్ అందరికి నచ్చే అంశాలు. రెండో హీరోయిన్ నివేద పేతురేజ్ చిత్ర పాత్రలో మంచి నటన కనబరించింది. జీవితంలో అన్ని కోల్పోయిన అమ్మాయిగా .. ఊరికే ఎవరిని నమ్మని యువతిగా చక్కటి టాలెంట్ ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక హీరో తండ్రి పాత్రలో పోసాని నటన హైలెట్ గా నిలిచింది. కొడుకు తన జీవితంలో అన్ని ఫెయిల్యూర్ వస్తున్నా కూడా తిట్టకుండా అతని టాలెంట్ ను ఎంకరేజ్ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్ ఉన్నది కొద్దిసేపే అయినా ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేసాడు. సునీల్ పాత్ర కూడా బాగుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పరిధిలో బాగానే చేసారు. 

టెక్నీకల్ హైలెట్స్ : 

 దేవి శ్రీ అందించిన సంగీతం, రీ రికార్డింగ్ బాగుంది. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి సూపర్.  సినిమా చాలా అందంగా చూపించే ప్రయత్నం చేసాడు. అలాగే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమా చాలా నెమ్మదిగా సాగడం కొంత బోర్ కొట్టిస్తుంది. ఇక దర్శకుడు కిశోర్ తిరుమల ఎంచుకున్న కథ కొత్తదేమికాదు.  దానికి మంచి ట్రీట్మెంట్ జోడించి చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినదే, కానీ కథ విషయంలో ఎక్కడ ఆసక్తి కలిగించే మలుపూలు కానీ, ఆసక్తి కలిగించే సన్నివేశాలు ఎలివేట్ చేయలేదు. పైగా మొదటి భాగం తో పోలిస్తే రెండో భాగం చాలా నెమ్మదిగా సాగుతూ కాస్త బోర్ కొట్టించాడు దర్శకుడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  

విశ్లేషణ : 

చిత్రలహరి పేరుతొ తెరకెక్కిన ఈ సినిమాకు, టైటిల్ కి ఏమాత్రం జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చాలా పాత కథను తీసుకుని కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కానీ కథ విషయంలో ఎక్కడ మలుపులు గాని, ట్విస్ట్ గాని లేవు. దానికి తోడు కథ చాలా నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. హీరో, హీరోయిన్స్ నటన, సునీల్, వెన్నల కిషోర్ ల కామెడీ ఆకట్టుకునే అంశాలు. సినిమా విషయంలో దర్శకుడు ఎంచుకున్న రొటీన్ కథను ఇంకాస్త ఆసక్తిగా మలిచివుంటే బాగుండేది. మొత్తానికి మరో మంచి ప్రేమకథను సమ్మర్ స్పెషల్ గా చూడొచ్చు.  

ట్యాగ్ లైన్ : రొటీన్ కథే 

Recent reviews